గెట్ రెడీ.. “పుష్ప 2” తో బన్నీ బర్త్ డేకి బ్లాస్ట్ ట్రీట్

గెట్ రెడీ.. “పుష్ప 2” తో బన్నీ బర్త్ డేకి బ్లాస్ట్ ట్రీట్

Published on Mar 29, 2024 2:34 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకొక్కటిగా అరుదైన ఘనతలు అందుకుంటూ వరల్డ్ వైడ్ గా తన రూలింగ్ కొనసాగిస్తున్నాడు. మరి ఇప్పుడు తాను నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2 The Rule) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అనేక అంచనాలు కూడా నెలకొనగా ఇది వరకే వచ్చిన సాలిడ్ అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ గ్రాండ్ ట్రీట్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం ఈ ఏప్రిల్ లో వస్తున్న అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ (Pushpa 2 Teaser) ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రానుంది. ఆల్రెడీ పుష్ప 2 ఇంట్రో గ్లింప్స్ తోనే మేకర్స్ సాలిడ్ బజ్ ని రేకెత్తించారు. ఇక టీజర్ తో ట్రీట్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు.

అయితే ఈ టీజర్ ని ఏప్రిల్ 8న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు