స్టార్ హీరో ఇంట్లో బాంబ్…అర్థరాత్రి హై డ్రామా.

Published on Jul 5, 2020 12:03 pm IST

స్టార్ హీరో విజయ్ ఇంటి వద్ద అర్థ రాత్రి హై డ్రామా నడిచింది. చెన్నై పోలీసులు బాంబ్ హెచ్చరికలతో విజయ్ ఇంటిని జల్లెడ పట్టారు. విషయంలోకి వెళితే గత అర్ధ రాత్రి ఓ యువకుడి నుండి చెన్నై పోలీసులకు ఓ కాల్ రావడం జరిగింది. హీరో విజయ్ ఇంటిలో బాంబ్ పెట్టినట్లు, అతని ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు తెలియజేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సాలగ్రామం లోని విజయ్ ఇంటికి సిబ్బందితో చేరుకోని బాంబు కోసం జల్లెడ పట్టారు.

ఐతే ఎటువంటి బాంబు కనిపించకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఎవరో ఆకతాయి చర్యగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొద్దిరోజుల క్రితం ఇలానే రజిని కాంత్ ఇంటిలో బాంబ్ పెట్టినట్లు వార్తలు రాగా పోలీసులు హడావుడి చేయడం జరిగింది. చివరికి ఆ ఫోన్ చేసింది ఓ మానసిక రోగి అని తెలుసుకొని అతన్ని వదిలేశారు.

సంబంధిత సమాచారం :

More