లేటెస్ట్..”ఆచార్య” రిలీజ్ డేట్ పై క్లారిటీ.?

Published on Aug 7, 2021 8:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో మెగాస్టార్ వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ చిత్రం షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉండగా రిలీజ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ అనౌన్సమెంట్ ఎంతో దూరంలో లేదని తెలుస్తుంది. ప్రతి వారం లో అప్డేట్ ఇస్తున్నట్టుగానే ఈవారాంతంలో మరో అప్డేట్ లా రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నట్టు బజ్ నడుస్తుంది.

మరి ఈ భారీ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉంటుందా లేక వచ్చే ఏడాది ఉంటుందా అన్నది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :