టాక్..చరణ్ భారీ ప్రాజెక్ట్ లాంచ్ కి డేట్ ఫిక్స్?

Published on Sep 3, 2021 7:00 pm IST


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీ స్టారర్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో రాజమౌళి మరియు తారక్ లతో చేసిన “రౌద్రం రణం రుధిరం” ఆల్రెడీ కంప్లీట్ చేసేయ్యగా ఇంకా మెగాస్టార్ మరియు కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న “ఆచార్య” పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

అయితే ఈ చిత్రాల అనంతరం మరో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా చెయ్యనున్నారు. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతున్నా ఇండస్ట్రీ వర్గాల నుంచి మరో టాక్ దీనిపై వినిపిస్తుంది. మరి దీని ప్రకారం వచ్చే సెప్టెంబర్ 8న ఈ చిత్రం లాంచ్ అవ్వడానికి ముహూర్తం కుదిరినట్టుగా తెలుస్తుంది.

ఇది వరకే ఈ చిత్రం ఈ నెలలో లాంచ్ కానుంది అని టాక్ ఉంది ఇప్పుడు అది నిజం అవుతుంది. మరి ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే చరణ్, శంకర్ లో కెరీర్ లో బెంచ్ మార్క్ గా ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :