ప్రభాస్ మూవీలో ఛాన్స్ ఇస్తామంటూ భారీ మోసం!

Published on Jan 24, 2021 1:30 pm IST

చిత్ర పరిశ్రమలో మోసాలు చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ నటులను, స్టార్ హీరోతో డేట్స్ ఇప్పిస్తామంటూ నిర్మాతలను కొందరు మోసం చేస్తూ ఉంటారు. సినిమా అంటే పడిసచ్చే చాలా మంది అమాయకులు మోసగాళ్ల వలలో చిక్కి మోసపోతూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగు చూసింది. ప్రభాస్ మూవీలో నటించే అవకాశం ఇప్పిస్తానంటూ ఓ ముఠా కొందరు ఔస్తాహికులను మోసం చేశారు. విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్ మూవీలో నటించే అవకాశం ఉందంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరిట ప్రకటిన విడుదల చేయడం జరిగింది. దీనికోసం ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని వారు సూచించారు.

ప్రభాస్ సినిమాలో అవకశాశం అనడంతో కొందరు రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బులు వారి చెల్లించడం జరిగింది. త్వరలోనే మీకు మెసేజ్ వస్తుంది, సిద్ధంగా ఉండాలని ఆ ప్రొడక్షన్ హౌస్ సభ్యులు వాళ్లకు తెలియజేశారట. చాలా కాలం అవుతున్నా మెసేజ్ రాకపోవడంతో అనుమానంతో ప్రొడక్షన్ హౌస్ కి ఒక్కొక్కరిగా వెళ్లి ఆరా తీయగా మోసపోయాయమని అర్థమైందట. దీనితో పోలీసులను వారు ఆశ్రయించారట. ఒక్కొక్కరి నుండి ఐదు వేల నుండి పది వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముంబై వేదికగా జరిగిన ఈ చీటింగ్ పై పోలీసులు విచారణ మొదలుపెట్టారట.

సంబంధిత సమాచారం :