ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu)
కూడా ఒకటి. మరి ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే కాకుండా రీజనల్ గా కూడా భారీ ఓపెనింగ్స్ సాధించి డే 1 నుంచే రికార్డుల జాతర షురూ చేసింది.
అయితే ఈ సినిమా థియేటర్స్ లో 370 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి ఇటీవల ఓటిటిలో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఓటిటిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా రికార్డుల జాతర స్టార్ట్ చేసింది. జీ5 తెలుగులో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా కేవలం 24 గంటల్లోనే ఏకంగా 200 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి జీ 5 లో కొత్త రికార్డు సెట్ చేసినట్టు వారు తెలిపారు.
దీనితో అటు థియేటర్స్ లోని ఇటు ఓటిటిలో కూడా మన శంకర వరప్రసాద్ గారు రికార్డులని ఉతికి ఆరేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ సాలిడ్ క్యామియోలో నటించి సినిమాని మరింత పుష్ చేశారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సుష్మిత కొణిదెల సాహు గారపాటి నిర్మాణం వహించారు.
THE BIGGEST OPENING EVER on Zee5 🥳
The Mega Blockbuster hits yet another record 👑#ManaShankaraVaraPrasadGaru
STREAMING NOWMegastar @KChiruTweets
Victory @Venkymama@AnilRavipudi #Nayanthara @Shine_Screens @GoldBoxEnt#ManaShankarVaraPrasadGaruOnZee5 #Chiranjeevi pic.twitter.com/br6sGV43dn— ZEE5 Telugu (@ZEE5Telugu) February 12, 2026


