ఓ అమ్మాయి వల్ల నాగచైతన్య, సమంత మధ్యలో గ్యాప్ అట ?

Published on Jul 17, 2018 2:55 pm IST


సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే నాగచైతన్య, సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత కూడా సమంత సినిమాలను కంటిన్యూ చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. కాగా ‘నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా భార్యాభర్తలైన నాగ చైతన్య, సమంత మధ్యలోకి మరో అమ్మాయి ఎంటర్ అవ్వతుందట, దాంతో భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు వస్తాయి. వాట్ని దాటుకొని మళ్ళీ ఆ భార్యాభర్తలు తమ బంధాన్ని ఎలా నిలుపుకున్నారన్నదే ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఏమైనా తమ పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :