బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ వీరేనా…?

Published on Jun 11, 2019 12:01 pm IST

బిగ్ బాస్ ఫస్ట్ సిరీస్ మరియు సెకండ్ సిరీస్ తెలుగు రాష్ట్రాలలో అనుకున్న ఆదరణ కంటే ఎక్కువగానే దక్కించుకున్నాయి. దీనితో బిగ్ బాస్-3 కోసం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు స్టార్ మా ప్రతినిధులు. హోస్ట్ గా కింగ్ నాగార్జున న తన అంగీకారం తెలిపారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రాం కి ఇంకా కొంచెం హైప్ వచ్చి చేరింది. ఈ సారి కంటెస్టెంట్ లిస్ట్ లో పేర్లు కూడా ఆసక్తి గొలిపే విధంగా ఉన్నాయి.

ఇప్పటికే వరుణ్ సందేశ్,కమల్ కామరాజు,గుత్తా జ్వాల, తీన్మార్ సావిత్రి, సీరియల్ యాక్టర్ జాకీ లు ఈ షో కి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ ముఖి,కే ఏ పాల్ కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉంది. షో నిబంధనల ప్రకారం హౌస్ లోకి ప్రవేశించే వరకు కంటెస్టెంట్ ల పేర్లు బయట పెట్టకూడదనే నిబంధన ఉండటంతో ఈ వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. నిజంగా ఎవరికి అవకాశం దక్కింది అని తెలియాలంటే మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More