చిరు..బాబీ..ఓ మాస్ మసాలా డ్రామా..?

Published on Jul 10, 2021 9:07 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ రెండు సాలిడ్ రీమేక్ సబ్జెక్టులు సహా దర్శకుడు బాబీ తో ఓ సినిమాలతో సాలిడ్ లైనప్ ఉంది. మరి వీటిలో వీటిలో మొదట రెండు రీమేక్ సినిమాలను కంప్లీట్ చేసేసి ఫుల్ ఫోకస్ స్ట్రైట్ సినిమా అయినటువంటి బాబీ ప్రాజెక్ట్ పై చిరు పెట్టనున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసేలా సాలిడ్ మాస్ మసాలా డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్క్రిప్ట్ ఎంతమేర కంప్లీట్ అయ్యిందో కానీ మెగాస్టార్ నుంచి మాత్రం ఫుల్ మీల్స్ ఇచేలా బాబీ డిజైన్ చేస్తున్నాడని టాక్. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎప్పుడు నుంచి మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :