గోపీచంద్ భారీ సినిమాకి నెవర్ బిఫోర్ క్లైమాక్స్! డీటెయిల్స్ ఇవే

గోపీచంద్ భారీ సినిమాకి నెవర్ బిఫోర్ క్లైమాక్స్! డీటెయిల్స్ ఇవే

Published on Jan 23, 2026 5:40 PM IST

Gopichand-33

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ తాజా చిత్రం కోసం తెలిసిందే. తన కెరీర్ 33వ చిత్రాన్ని ఘాజి చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఓ భారీ హిస్టారికల్ చిత్రంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మేకర్స్ భారీ ఖర్చుతో సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. ఇలా ఓ భారీ క్లైమాక్స్ ఎపిసోడ్ కి రంగం సిద్ధం చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు.

వెంకట్ మాస్టర్ సారథ్యంలో నైట్ షూట్ తో ఒక నెవర్ బిఫోర్ క్లైమాక్స్ సీక్వెన్స్ ని ప్రస్తుతం చేస్తున్నట్టు మేకర్స్ రివీల్ చేశారు. మరి ఈ సీక్వెన్స్ మొత్తం భారీ స్కేల్ లో ఉంటుంది అని అంటున్నారు చిత్ర యూనిట్. మరి బిగ్ స్క్రీన్స్ పై ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరు? సంగీతం ఇతర డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు