“అఖండ” రిలీజ్ కి కొత్త డేట్ కన్ఫర్మ్ అయ్యిందా.?

Published on Aug 4, 2021 3:50 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అఖండ”. బాలయ్య హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ షూట్ లో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ చిత్రం విడుదల మరియు నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అన్నది చాలా ఆసక్తిగా మారింది.

అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇపుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది అని టాక్ వినిపిస్తుంది. మరి ఈ డేట్ ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యింది అన్నది అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :