‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?

‘రౌడీ జనార్దన’ పై కొత్త రూమర్ ?

Published on Apr 28, 2026 1:06 AM IST

Rowdy-Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఐతే, ఇప్పుడు ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీక్వెన్స్ పై ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ కోసం విజయ్ దేవరకొండ రిస్కీ యాక్షన్ స్టంట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడని.. ఈ సీక్వెన్స్ లో విజయ్ లుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ క్లైమాక్స్ లో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉందని టాక్. మరి ఈ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.

కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు