మార్షల్ ఆర్ట్స్ కిక్ ఇస్తున్న విజయశాంతి, వైరల్ అవుతున్న వీడియో

Published on Jan 14, 2020 1:57 pm IST

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా అనుభవించిన స్టార్ డమ్ బహుశా టాలీవుడ్ లో ఎవరూ అనుభవించి ఉండరు. స్టార్ హీరోలకు సమానమైన స్టార్ డమ్ ఆమె సంపాదించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆమెకు ప్రతేకమైన ఫైట్స్, సన్నివేశాలు ఉండేవి. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సౌత్ లోనే ట్రెండ్ సెట్టర్ గా ఉన్నారు. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలతో సోలో గా ఇండస్ట్రీ హిట్ లు అందుకున్నారు. ఇక సరిలేరు నీకెవ్వరు షూటింగ్ సెట్స్ లో పర్ఫెక్ట్ కిక్ ఇస్తున్న విజయ శాంతి వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది. 55ఏళ్ల విజయశాంతి అలా ఓ అద్భుతమైన కిక్ ఇవ్వడం ఆమె ఫిట్ నెస్, ఎనర్జీ లెవెల్స్ తెలియజేస్తున్నాయి.

సూపర్ స్టార్ విజయ శాంతి పదమూడేళ్ల గ్యాప్ తరువాత కూడా వెండి తెరపై తన పవర్ చూపించారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో భారతిగా ఆమె అద్బుతంగా నటించారు. మహేష్ రష్మిక జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మూడు రోజులలో 50కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ కలెక్షన్స్ దిశగా సాగుతుంది.

సంబంధిత సమాచారం :