చనిపోయింది ‘సైరా’ నటుడేనా ?

Published on May 16, 2019 2:52 pm IST

గచ్చిబౌలిలో ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెందిన రష్యా దేశస్తుడు చిరంజీవి, సురేందర్ రెడ్డిలు చేస్తున్న ‘సైరా’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గచ్చిబౌలి ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అలెగ్జాండర్‌ను పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్చగా అతను చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడట.

అతని వద్ద ఉన్న కెమెరాలోని ఫోటోల ఆధారంగా అతను ‘సైరా’ సినిమాకు సంబందించిన వ్యక్తని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ‘సైరా’ కాస్టింగ్ విభాగం చిత్రంలో బ్రిటిష్ దేశస్తుల పాత్రల కోసం చాలామంది విదేశీయుల్ని తీసుకున్నారు. వారిలో అలెగ్జాండర్‌ కూడా ఒకడై ఉంటాడని అంటున్నారు. ఇతను మార్చి నెలలో టూరిస్ట్ వీసా మీద హైదరాబాద్ నగరానికి వచ్చాడట. మరి అలెగ్జాండర్‌ నిజంగానే తమ సినిమాలో నటించిన వ్యక్తా కాదా అనేది ‘సైరా’ యూనిట్ సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.

సంబంధిత సమాచారం :

More