మెగాస్టార్ నెక్స్ట్ పై సెన్సేషనల్ బజ్..ఎంతవరకు నిజం.?

Published on Aug 14, 2021 6:26 pm IST


ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “ఆచార్య” నుంచి తన నెక్స్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ ని నిన్ననే షురూ చేసిన సంగతి తెలిసిందే. అదే మళయాళ బ్లాక్ బస్టర్ చిత్రం “లూసిఫర్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంని నిన్ననే దర్శకుడు మోహన్ రాజా స్టార్ట్ చేశారు. మరి ఇదిలా ఉండగా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై సెన్సేషనల్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

అదేమిటంటే ఈ చిత్రంలో మరో మెగాస్టార్ కూడా కనిపిస్తారట.. అంటే బాలీవుడ్ మెగాస్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నారట. అయితే ఇందులో ఇంకా ఎంతమేర నిజముందో కానీ ఈ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో బయటకు వచ్చింది. ఇదే కనుక నిజం అయితే ఇంపాక్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా “గాడ్ ఫాదర్” అనే టైటిల్ పరిశీనలో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :