ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లు మారాయి. అంతే కాకుండా కొందరు దర్శకులు నుంచి వారి వారి సినిమాటిక్ యూనివర్స్ లు స్టార్ట్ చేయడంతో ట్రెండ్ కూడా మారింది. అయితే తన సినిమాలతో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిన తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ “విక్రమ్” తర్వాత తన సినిమాలపై ఓ రేంజ్ లో హైప్ ని సెట్ చేస్కున్నాడు.
అయితే ఈ లైనప్ లో ఓ సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో లోకేష్ సినిమా చేయనుండడం అనేది ఇప్పుడు కన్ఫర్మ్ కాగా దీనిని మించిన ఎగ్జైటింగ్ వార్త ఏమిటంటే లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో లాస్ట్ సినిమాని అయితే సినిమాటిక్ యూనివర్స్ ని ప్రభాస్ చిత్రం తోనే ఎండ్ చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై ఒక ఊహించని బజ్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది.
