మహేష్ నెక్స్ట్ కి ఈ విషయంలో మాత్రం మంచి క్లారిటీ వచ్చింది.!

Published on Aug 11, 2021 2:30 am IST

నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు ఏ రేంజ్ హంగామా చేశారో చూసాము. అలాగే వాటికి మరింత బూస్టప్ ఇస్తూ మహేష్ చేస్తున్న చేయబోతున్న తాజా సినిమాలపై అదిరే అప్డేట్స్ కూడా వచ్చాయి. మరి వాటిలో ఇప్పుడు చేస్తున్న “సర్కారు వారి పాట” మాత్రమే కాకుండా దాని తర్వాత తన హ్యాట్రిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం టెక్నీకల్ టీం మరియు హీరోయిన్ ఎవరు అన్న అంశాలు అధికారికంగా ప్రకటించారు.

అయితే ఫ్యాన్స్ అండ్ ఈ కాంబో లవర్స్ కి మాత్రం ఒక విషయం నిన్నటితో చాలా బాగా క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఇది వరకు మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలకు కూడా సంగీత బ్రహ్మ మణిశర్మనే సంగీతం ఇచ్చారు. పైగా రెండు కూడా మ్యూజికల్ గా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. దీనితో హ్యాట్రిక్ సినిమాకి కూడా వారే రిపీట్ అవ్వాలని అంతా ఆశించారు.

కానీ థమన్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడని కొంతమందికి ఆల్రెడీ తెలుసు కానీ అధికారికంగా నిన్న వెల్లడి అయ్యింది. అయితే ఈ కాంబోకి మణిశర్మ అయితే బాగుండు కదా అనుకున్న వారిని సైతం నిన్నటి అనౌన్సమెంట్స్ వీడియోతో థమన్ మెస్మరైజ్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన గత చిత్రాలు అతడు, ఖలేజా తరహాలోనే చాలా క్యాచీ అండ్ ఫ్రెష్ గా అనిపించడంతో దీనిపై వారంతా సాటిస్పై అయ్యారు. దీనితో మాత్రం ఈ సినిమాపై మ్యూజిక్ పరంగా ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :