పవన్ తో గట్టి సీక్వెన్స్ నే ప్లాన్ చేసిన క్రిష్.!

Published on Feb 23, 2021 2:15 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరి వాటిలో పవన్ అభిమానుల్లో మరియు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన అంచనాలు సెట్ చేసుకుంది మాత్రం తన 27వ చిత్రం క్రిష్ తో ప్లాన్ చేస్తుందే అనే చెప్పాలి.

ఇక దీనితో పాటుగా మరో చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే క్రిష్ తో తీస్తున్న సినిమాకు గాను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇప్పుడు మేకర్స్ ప్లాన్ చేసారని టాక్ విన్నాము. మరి దీనిని ఓ రేంజ్ ప్లాన్ చేసారని తెలిసింది. మరి ఈ సీన్ లో కొంతమంది భారీ కాయం గల పహిల్వాన్ లను ఈ సెట్స్ లోకి దింపారు.

మరి వారంతా కలిసి పవన్ తో కలిపి ఉన్న ఫోటోలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. దీనితో ఈ సీక్వెన్స్ ను క్రిష్ పవన్ తో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. మరి సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రాన్ని ఎలా చూపిస్తారో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి గాను కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :