“సర్కారు వారి పాట” నుంచి సాలిడ్ అప్డేట్ రానుందా?

Published on Jul 27, 2021 7:02 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇంకొన్ని రోజుల్లో మాస్ ట్రీట్ కూడా ఈ సినిమా నుంచి పడనుంది. మరి దీనిపైనే ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన బజ్ వినిపిస్తూనే వస్తుంది.

మరి అలా ఈ చిత్రం పై ఒక అదిరే అప్డేట్ మహేష్ బర్త్ డే కానుకగా ఈరోజే రానున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆ సాలిడ్ అప్డేట్ రానున్నట్టుగా నయా టాక్. మరి ఈ అప్డేట్ నిజంగా ఈరోజే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి వారితో మహేష్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :