ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిలిం ‘ధురంధర్ : ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. మొదటి భాగానికి భిన్నంగా, ఈ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
అయితే, ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. జియో స్టూడియోస్ మరియు దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రం కోసం మార్చి 18న సాయంత్రం 5 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూస్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా నిడివి దాదాపు నాలుగు గంటల వరకు ఉండటంతో, మొదటి రోజున షోల సంఖ్య పరిమితంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగానే పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా సినిమాకు మంచి బూస్ట్ తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో పెయిడ్ ప్రివ్యూస్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు ‘స్త్రీ 2’ పేరిట ఉంది. అయితే, ధురంధర్ 2పై ఉన్న సాలిడ్ క్రేజ్ చూస్తుంటే, ఆ రికార్డును ఇది రెట్టింపు మార్జిన్‌తో అధిగమించేలా కనిపిస్తోంది. ఒకవేళ మొదటి భాగానికి వచ్చినట్లుగానే పాజిటివ్ టాక్ వస్తే, ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


