‘అక్కినేని’ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ !

‘అక్కినేని’ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ ప్రైజ్ !

Published on Jun 15, 2026 6:30 PM IST

తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన క్లాసిక్ చిత్రాల్లో ‘గీతాంజలి’ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున – గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా అక్కినేని అభిమానులకు నాగార్జున ప్రత్యేక పుట్టినరోజు కానుకగా ఆగష్టు 28, 2026న ఈ సినిమా తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. శ్రీ పద్మిని సినిమాస్ సోషల్ మీడియాలో విడుదల తేదీని ప్రకటించింది.

కాగా మే 9న 1989 లో విడుదలైన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషల్లోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. మొత్తానికి క్లాసిక్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది. మరి ఈ తరం ప్రేక్షకులను ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు