అప్పుడే “ఉప్పెన”కు స్ట్రీమింగ్ డేట్.?

Published on Feb 14, 2021 3:03 am IST

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఉప్పెన”. లేటెస్ట్ గా విడుదల కాబడిన ఈ చిత్రం అనుకున్న దాని కంటే భారీ ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ ను నమోదు చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడో కిందటి ఏడాదే విడుదలకు రావాల్సింది అని తెలిసిందే.

కానీ కరోనా వల్ల ఆగాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి ఊపందుకున్న ఓటిటి చాలానే సినిమాలనే విడుదల చేసింది. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం థియేట్రికల్ విడుదలకే స్టిక్ అయ్యి ఉండడంతో ఎట్టకేలకు థియేటర్లులోనే విడుదలకు వచ్చింది. అయితే ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు అందులో ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందో అన్నది తెలుస్తుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఏప్రిల్ 11 స్ట్రీమింగ్ కు రానుందట. అంటే సినిమా విడుదల కాబడిన 50 రోజుల తర్వాతనే మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్తో పోలిస్తే ఇది బెటర్ ప్లాన్ అని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం థియేటర్స్ లో ఈ చిత్రం అదరగొడుతుంది.

సంబంధిత సమాచారం :