బజ్..చరణ్ భారీ ప్రాజెక్ట్ లాంచ్ కి సర్ప్రైజింగ్ గెస్ట్.?

Published on Sep 4, 2021 7:04 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు కూడా ఇప్పుడు అయ్యిపోవచ్చాయి. దీనితో ఇక ఈ చిత్రం తర్వాత అందరి దృష్టి తాను చేసే నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ పై పడ్డాయి. ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ కాంబోలో అనౌన్స్ చేసిన నాటి నుంచి వీరి కాంబోపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ బిగ్ ప్రాజెక్ట్ వచ్చే సెప్టెంబర్ 8 న గ్రాండ్ గా లాంచ్ కానుంది అని ఫిక్స్ కాగా ఇప్పుడో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

మరి దాని ప్రకారం ఈ సినిమా ఈ చిత్రం లాంచ్ కి శంకర్ బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపుటున్నట్టుగా టాక్. మరి ఇంకెవరో కాదు ఈ సినిమా అనంతరం శంకర్ అపరిచితుడు అక్కడ రీమేక్ చేయనున్న స్టార్ హీరో రణ్వీర్ కపూర్ అని తెలుస్తోంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజం అయితే మరి పాన్ ఇండియన్ లెవెల్లో అప్పుడే శంకర్ ఈ సినిమాని ప్రెజెంట్ చేసేయ్యడం స్టార్ట్ చేసినట్టే అని చెప్పాలి..

సంబంధిత సమాచారం :