ఆస్కార్ బరిలో తెలుగు ఔత్సాహకుడి కష్టం!

ఆస్కార్ బరిలో తెలుగు ఔత్సాహకుడి కష్టం!

Published on Nov 15, 2015 4:00 PM IST

sidharth
ఆస్కార్స్… హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులందరికీ పరిచయమున్న అవార్డ్స్. ప్రతీ ఏడాదీ ఉత్తమ ప్రతిభ కనబరిచే హాలీవుడ్ సినిమాలతో పాటు ఇతర ఫారిన్ లాంగ్వేజీ సినిమాలకు కూడా కలిపి పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంలో పకడ్బందీగా, ఎంతో పరిశీలన, చర్చల తర్వాత ఎన్నికైన సినిమాలకు అవార్డుల ప్రకటిస్తారు. అలాంటి ఓ ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో మన తెలుగు తేజం టెక్నికల్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టి రూపొందించిన సినిమా ఎన్నికైతే ఎలా ఉంటుందీ? వినడానికే రేస్‌లో నిలిస్తే ఎలా ఉంటుందీ? వినడానికే బాగుంది కదూ!? సిద్ధార్థ మాగంటి ప్రస్తుతం దీన్ని నిజం చేశాడు.

హాలీవుడ్ దర్శకుడు డాన్ లాండ్ రూపొందించిన ‘అరియా ఫర్ ఏ కౌ’ అనే షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ఆస్కార్ బరిలో టాప్ 60 సినిమాల జాబితాలో ఉంది. ఈ 60 సినిమాల నుంచి రెండు దశల్లో ఆస్కార్ విజేతను ప్రకటిస్తారు. ఇక అరియా ఫర్ ఏ కౌ అనే సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను సిద్ధార్థ అన్నీ తానై నడిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. సిద్ధార్థ ఈ షార్ట్‌ఫిల్మ్‌పై చూపిన ఆసక్తిని ఇష్టపడి దర్శకుడు డాన్ లాండ్, నిర్మాత కోనీ థాంప్సన్ సిద్ధార్థ్‌కి పూర్తి ప్రొడక్షన్ బాధ్యతలు అప్పజెప్పారు.

ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ వర్క్, సౌండ్ మిక్సింగ్.. ఇలా టెక్నికల్‌గా అన్ని బాధ్యతలనూ తనపై వేసుకొని సిద్ధార్థ ఈ సినిమాను పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమవ్వడమే కాకుండా ఫైనల్‌గా ఆస్కార్ రేసులోనూ నిలవడంతో సిద్ధార్థ మాగంటి ప్రతిభ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. గతంలో అమెరికాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన విద్యనభ్యసించిన సిద్ధార్థ్ ప్రముఖ దర్శకులతో హాలీవుడ్ టాప్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో సేవలందించారు.

తాజా వార్తలు