ఈ స్టార్ హీరోయిన్ ని బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్రెండ్.!

Published on Aug 13, 2021 12:39 pm IST


మన ఇండియన్ సినిమా దగ్గర పలు కాంట్రవర్సీలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.. మరి వాటిలో కొంతమంది నటులు సహా దర్శకులు పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెనే రాధికా ఆప్టే టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో మరియు వెబ్ సిరీస్ లో నటించిన ఈమె హాట్ టాపిక్ గా నడుస్తుంది.

ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈమె విషయంలో చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తాజాగా చేసిన కామెంట్లో లేక ఇచ్చిన స్టేట్మెంట్ నో కానీ వారి మనోభావాలను దెబ్బ తీసినట్టు తెలుస్తుంది. ఆమె దేశ సంస్కృతికి విరుద్ధంగా కామెంట్స్ చేస్తుంది అని డబ్బులు ఫేమ్ కోసం ఎంతకైనా దిగజారుతోంది అని ఆమె సినిమాలు బాయ్ కాట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

అయితే దీనికి గల అసలు కారణం ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ వారు బాలీవుడ్ సినిమాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి సినిమాలు ఎప్పుడూ భారతదేశ సంస్కృతిని అవమానపరిచే విధంగానే ఉంటాయని ఇదే విషయంలో తెలుపుతున్నారు. మరి ఈ రగడ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.. మరి గతంలో రాధికా బాలయ్య విషయంలో కూడా ఓ కాంట్రవర్సీతో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :