రామ్ క్రేజీ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చేసిన మేకర్స్.!

Published on Jul 7, 2021 12:00 pm IST

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ సినిమాల స్పెషలిస్ట్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. తాను చేసిన లాస్ట్ రెండు సినిమాలు మాస్ లో మంచి ఇంపాక్ట్ కలిగించడంతో రామ్ క్రేజ్ కూడా మాస్ ఆడియెన్స్ లో పెరిగింది. దీనితో ఈ సాలిడ్ చిత్రం అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ తెచ్చుకుంది.

అయితే గత కొన్ని రోజులు కితమే ఈ సినిమా షూట్ ఈ జూలై మధ్య నుంచి స్టార్ట్ అవ్వనుంది అని తెలిపాము. ఇప్పుడు మేకర్స్ కూడా దానిపైనే అప్డేట్ ఇచ్చేసారు. ఈ వచ్చే 12వ తారీఖు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు తెలియజేసారు.

అలాగే మరిన్ని అప్డేట్స్ కూడా వదులుతామని తెలిపారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే కేజీయఫ్ స్టంట్ మాస్టర్ కాంబో అంబు – అరివ్ బ్రదర్స్ కాంబో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :