మహిళ చేతిలో మోసపోయిన విశాల్..!

మహిళ చేతిలో మోసపోయిన విశాల్..!

Published on Jul 5, 2020 2:59 PM IST

హీరో విశాల్ వద్ద పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మోసానికి పాల్పడినట్లు ఆయన మేనేజర్ చెన్నైలోని వడపలని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఆరేళ్లుగా తమ వద్ద పనిచేస్తున్న ఆమె 45లక్షల వరకు కంపెనీ డబ్బులు కాజేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరో విశాల్ కి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగి ఏళ్లుగా కంపెనీ డబ్బులు పక్కదోవ పట్టించిందని తెలుస్తుంది.

ఇటీవల సదరు మహిళా ఉద్యోగి 45లక్షల ఖరీదు చేసే ఇంటిని కొనడంతో ఈ విషయం వెలుగులో వచ్చింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణ చేపట్టారు. ఇక విశాల్ లేటెస్ట్ మూవీ చక్ర టీజర్ విడుదలైన మంచి రెస్పాన్స్ అందుకుంది. ఎమ్ ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ టి టి లో విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు