‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్‌ విడుదల

‘ఆ గ్యాంగ్ రేపు 3’ ట్రైలర్‌ విడుదల

Published on Jul 16, 2025 7:30 AM IST

Aa-Gang-Rape

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన ‘ఆ గ్యాంగ్‌ రేపు’తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్‌ చిత్రం ‘ఆ గ్యాంగ్‌ రేపు-2’ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘లవ్‌ యూ టూ’ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ‘ఆ గ్యాంగ్‌ రేపు-3’ ఆయనకు దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, హ్యాండ్ హెల్డ్ స్టైల్ చిత్రీకరణ చేసిన సినిమాటోగ్రాఫర్ నాని ఐనవెల్లి విజువల్స్ మరింత ఎంగేజింగ్ గా ఉంటాయి. కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

కాగా ఈ చిత్రం కంటెంట్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అతిథిగా విచ్చేసిన నటుడు, కొరియోగ్రాఫర్‌ ఆటా సందీప్‌ మాట్లాడుతూ.. ‘గ్యాంగ్‌ రేపు.. షార్ట్‌ ఫిల్మ్‌గా వైరల్‌ అయ్యింది. దీని రెండో భాగంలో నేను చేశాను. అది కూడా బాగా హిట్‌ అయ్యింది. ఆ గ్యాంగ్‌ రేపు 3కి అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. నేను కొరియోగ్రాఫర్‌గానే ఉండాలనుకుంటున్నాను. ఇంత బోల్డ్‌గా ఉన్న పాత్రను చేయాలనుకులోదు. అందుకే ఈ సినిమా చేయలేదు. చాలా కారణాలతో ఈ సినిమా చేయలేదు. ఈ టీమ్‌తో నాకు చాలా మంచి స్నేహం ఉంది. ఫీచర్‌ ఫిలిం చేసి, కథ నచ్చి ఓటీటీ కోసం మంచి పాషన్‌తో ఈ సినిమా చేశాడు. ఈ ట్రైలర్‌, బోల్డ్‌గా ఉంది. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సినిమాలో దర్శకుడు చర్చిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఓటీటీలో అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ‘2015లో అనుకోకుండా నాకున్న చిన్న ప్రయత్నం వైరల్‌ అయిపోయి గుర్తింపు తెచ్చింది. గ్యాంగ్‌ రేపు 2 కూడా హిట్‌ అయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశాడు. ఆ గ్యాంగ్‌ రేపు 3 టైటిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. నిర్మాత నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తోచేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. అందర్ని అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఆటా సందీప్‌ ఆ గ్యాంగ్‌ రేప్‌, గ్యాంగ్‌ రేప్‌ 2లో చేశాడు. కానీ ఈ సినిమాలో ఆయనను విలన్‌గా చేపించడం ఇష్టం లేదు అందుకే చేయించలేదు.అందుకే కొత్తవాళ్లతో చేశాను’ అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ”ట్రైలర్‌లోనే దర్శకుడి విజన్‌ అర్థమైపోతుంది. మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది. యోగి నాకు మంచి స్నేహితుడు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. కొత్త టీమ్‌తో చేశాం. ఈ సినిమా ప్రాసెస్‌లో నాకు ఈ చిత్రంపై ఇష్టం పెరిగింది. ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నిషయిన్స్‌తో ఎంతో కష్టపడి చేశాడు. అందరూ హార్డ్‌ వర్క్‌తో సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు