“సాహో” తర్వాత “AA19” యేనా..?

Published on Jul 24, 2019 5:30 pm IST

మన స్టార్ హీరోలు ఒక సినిమా మొదలు పెట్టారు అంటే దానికి సంబంధించిన ఏ ఒక్క చిన్న అప్డేట్ అయినా సరే బయటకు రాకుండా పోతుందా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు.ఇప్పుడు అలాగే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ “సాహో” అప్డేట్స్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.చాలా కాలం ఆలస్యం చేసి తర్వాత జోరుగానే అప్డేట్స్ ఇచ్చినా ఇంకా కొన్ని కొన్ని బాకీ ఉన్నాయి.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా తర్వాత బన్నీ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అప్డేట్స్ ను టైం టు టైం ఇచ్చేందుకు ఈ రెండు సినిమాలకు కామన్ పాయింట్ అయినటువంటి ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ ను అభిమానులు ఇప్పుడు అడుగుతున్నారు.

ప్రస్తుతానికి “సాహో” అప్డేట్స్ మరియు ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన ఎస్ కె ఎన్ సహా సాహో బృందం మరి ఈ సినిమా విడుదల తర్వాత బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న AA19 అప్డేట్స్ ను ఎలా అందిస్తారో చూడాలి.ప్రభాస్ మరియు శ్రద్ధా కపూర్ లు హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన “సాహో” చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉండగా బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :