ఆచారి అమెరికా యాత్ర కొత్త విడుదల తేది !

22nd, March 2018 - 09:05:32 AM

మంచు విష్ణు, ప్రజ్ఞ్య జస్వాల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం ఈ సినిమాలో ఫుల్ లెన్త్ కామెడి రోల్ లో కనిపించబోతున్నాడు. గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి, మంచు విష్ణు కాంబినేషన్లో దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం సినిమాలు వచ్చి విజయం సాధించాయి. అదే కోవలోకి ఈ సినిమా చేరబోతోంది.

ఏప్రిల్ 6 న ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతోంది.ఈ సినిమా కోసం తమన్ అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎల్ కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.