టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ సినిమా ‘రణబాలి’ ఇప్పుడు ఓటిటిలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న తదుపరి అవైటెడ్ సినిమానే రౌడీ జనార్ధన. యువ దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా చాలా వరకు షూట్ ని పూర్తి చేసుకుంది.
అయితే రణబాలి రిలీజ్ తర్వాత తీసుకున్న కొంచెం గ్యాప్ నుంచి మళ్ళీ యాక్షన్ ని మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. చిన్న వెకేషన్ తర్వాత వచ్చిన విజయ్ ఇప్పుడు రౌడీ జనార్ధన కొత్త షెడ్యూల్ ని మహారాష్ట్రలో మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి రౌడీ బాయ్ ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా క్రిస్టో గ్జావియర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.


