తెలుగు స్టార్ రైటర్ సినిమాకు తమిళ హీరో సపోర్ట్ !
Published on Jul 29, 2018 6:06 pm IST

ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న థ్రిల్లర్‌ చిత్రం నీవెవరో. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో వస్తుండటం, రంగస్థలం తర్వాత ఆది నటిస్తోన్న చిత్రం కావటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది.

కాగా ఆగస్టు 24వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ చిత్రాన్ని ఎంవీవీ సత్యనారాయణతో కలిసి కోన వెంకట్‌, హరినాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు, ఐతే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని చెలియా అనే సాంగ్ ను తమిళ హీరో మాధవన్‌ చేతుల మీదుగా రేపు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook