డిసెంబర్లో మొదలుకానున్న ఆది పినిశెట్టి కొత్త చిత్రం !
Published on Dec 3, 2017 1:42 pm IST

ఈ మధ్య ‘సరైనోడు, నిన్నుకోరి’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన హీరో ఆది పినిశెట్టి హీరోగా డిసెంబర్ 1వ తేదీన ఆక్రొత్త చిత్రం ప్రారంభంకానుంది. కోన ఫిలిం కార్పొరేషన్, ఎం.వి.వి సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘లవర్స్’ చిత్ర దర్శకుడు హరి డైరెక్ట్ చేయనున్నారు.

ఇందులో ఆదికి జోడీగా తాప్సి నటించనుంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమా వైజాగ్, హైదరాబాద్, విజయవాడల నైపథ్యంలో సాగనుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు తోటరాజు సినిమాటోగ్రఫీ అందించనుండగా కోన వెంకట్ స్కీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

 
Like us on Facebook