మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. ఐతే, ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. ఇప్పుడు ఈ సాంగ్ కోసం హీరోయిన్ తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ‘జైలర్’లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు విష్ణు సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. ఐతే, ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అన్నట్టు భక్త కన్నప్పలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్‌లాల్ మెరవనున్నాడు. అలాగే, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది.