థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

థియేటర్‌/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!

Published on Apr 29, 2024 2:01 PM IST

ఈ మే మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. అలాగే, ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న చిత్రాలు ఇవే.

‘ఆ ఒక్కటీ అడక్కు’ :

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ప్రసన్న వదనం’ :

సుహాస్‌ కీలక పాత్రలో అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రసన్న వదనం’. మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘శబరి’ :

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శబరి’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

‘జితేందర్‌రెడ్డి’ :

ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘జితేందర్‌రెడ్డి’. ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ :

ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) మే 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ది వీల్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ :

డియర్‌ (తమిళ/తెలుగు) ఏప్రిల్‌ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయ్యింది.

బాయిలింగ్‌ పాయింట్‌-1 (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హీరామండి (హిందీ సిరీస్‌) మే 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

షైతాన్‌ (హిందీ) మే 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఎ టిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) మే 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

హాక్స్‌3 (వెబ్‌సిరీస్‌) మే 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వోంకా (హాలీవుడ్‌) మే 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌) మే 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు