ఆ హీరో అంగవైకల్యం కలిగిన అథ్లెట్ కథ చేస్తున్నారా?

Published on Dec 14, 2019 12:25 pm IST

సౌత్ లో ముఖ్యంగా తెలుగు తమిళ భాషలలో హీరో, విలన్ మరియు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు ఆది పినిశెట్టి. ఆయన హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతుంది. క్లాప్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృత్రిమమైన కాలు కలిగిన రన్నర్ గా ఆది కనిపించే అవకాశం కలదు. ఆ టైటిల్ డిజైన్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అంగ వైకల్యం కలిగిన అథ్లెట్ గా ఆది ఆకట్టుకోనున్నారని సమాచారం. కాగా నేడు ఆది జన్మదినం పురస్కరించుకొని ‘క్లాప్’ మూవీ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేశారు.

దర్శకుడు పృథ్వి ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, బిగ్ పిక్చర్స్, షిరిడీ సాయి పిక్చర్స్, సర్వాన్త్ రామ్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. తెలుగు మరియు తమిళ భాషలలో క్లాప్ మూవీ విడుదల కానుందని సమాచారం. ఆకాంక్ష సింగ్ ఆది కి జోడిగా నటిస్తుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా క్లాప్ మూవీ విడుదల కానుంది.

మోషన్ పోస్టర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :