ఆది డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తైంది

ఆది డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తైంది

Published on Dec 15, 2020 11:00 PM IST

Aadi Pinisetty

తాను హీరోని కాదని నటుడినని అనే వ్యక్తి ఆది పినిశెట్టి. భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికే ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఈయన ‘క్లాప్’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఇందులో ఆయన అథ్లెట్, కోచ్ పాత్రల్లో కనిపించనున్నారు. జనవరిలోనే ఈ సినిమా మొదలవగా లాక్ డౌన్ మూలంగా ఆగిపోయింది. నవంబర్ నెలాఖరున చివరి దశ షూటింగ్ స్టార్ట్ చేశారు. అది కూడ ఈరోజుతో పూర్తైంది. ఈ సంధర్భంగా ఆది మాట్లాడుతూ ఈ సినిమా ప్రయాణం నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇప్పుడు దాన్ని మీకు అందిస్తున్నాను అన్నారు.

ఇందులో ఆది సరసన ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్, పిఎంఎం ఫిలిమ్స్, కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పృథ్వీ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మాజీలు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆది చాలా ప్రత్యేకంగా తీసుకున్నారు. కష్టపడి అథ్లెట్ మేకోవర్ కూడ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు