ఆది పినిశెట్టి సినిమా షూటింగ్ పూర్తి !

18th, March 2018 - 08:20:05 PM

కోన వెంకట్ సమర్పణలో “గీతాంజలి” చిత్రాన్ని నిర్మించిన ఎం.వి.వి సినిమా మరియు కోన ఫిలిమ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా చిత్ర షూటింగ్ ఈరోజు పూర్తి అయ్యింది. లవర్స్ సినిమాకు దర్శకత్వం వహించిన హరినాథ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

కోనా వెంకట్, భవాని ప్రసాద్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలో ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. డిఫరెంట్ కథ, కథనాలతో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.