ఇంటర్వెల్ ఫైట్ లో ‘ఆగడు’ బిజీ..!

Published on Jul 18, 2014 4:14 pm IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాలలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్, మరికొందరు ఆర్టిస్టులు పాల్గొనగా ఇంటర్వెల్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ ఫైట్ పూర్తయిన తర్వాత శృతి హాసన్, మహేష్ బాబులపై ప్రత్యెక గీతం తెరకేక్కిస్తారు. ఆగస్ట్ 12న ‘ఆగడు’ మూవీ యూనిట్ నార్వేకి షిఫ్ట్ అవుతుంది. మహేశ్, తమన్నాలపై 2 పాటలను తెరకేక్కిస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసి సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేయనున్నారు. ఆడియో ఆగస్ట్ రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

‘దూకుడు’ వంటి భారి బ్లాక్ బస్టర్ తర్వాత యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు నిర్మాతలు ఎక్కడా రాజి పడకుండా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :