భాగ్యనగరంలో ఆగడు షూటింగ్

Published on Feb 3, 2014 12:47 pm IST

Mahesh-Babu-Aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు – మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. మహేష్ బాబు మరో సారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్.

మహేష్ బాబు – తమన్నా మొదటిసారి జతకడుతున్న సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో మూవీ రావాలి కానీ అప్పట్లో వర్క్ అవుట్ అవ్వలేదు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :