హిందీలో రీమేక్ అవుతున్న సూర్య హిట్ మూవీ..!

Published on Jul 13, 2021 12:02 am IST

ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ నిజ జీవిత కథ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “సూరరై పొట్ట్రు”. హీరో సూర్య నటించిన ఈ మూవీ అక్కడ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కాగా, “ఆకాశం నీ హద్దురా” పేరుతో వచ్చి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకురాలు సుధా కొంగరనే హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు.

అయితే హిందీలో ఈ చిత్రాన్ని హీరో సూర్య, అబుడాంటియా ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సూర్య పాత్రకి అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం మరియు హృతిక్ రోషన్ వంటి హీరోలలో ఒకరిని ఎంచుకోనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :