హైదరాబాదీతో అమీర్‌ఖాన్ ప్రేమాయణం?

Published on Jul 7, 2021 2:10 am IST


బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ విడాకులు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తొలుత అమీర్ ఖాన్ 1986లో రీనా ద‌త్తాను పెళ్లి చేసుకుని 15 ఏళ్ల‌ తర్వాత ఆమె నుంచి విడిపోయాడు. ఆ తర్వాత 2005లో కిర‌ణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. అయితే దాదాపు 15 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరిద్దరి దాంపత్య జీవితానికి కూడా తాజాగా విడాకుల ద్వారా బ్రేకులు పడింది. అయితే 56 ఏళ్ల వ‌య‌సున్న అమీర్‌ఖాన్‌ అసలు ఎందుకు విడాకులు తీసుకున్నాడన్న దానిపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

అయితే దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కుమార్తెగా నటించిన హైదరాబాద్ భామ ఫాతిమా స‌నా షేక్‌తో అమీర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని అందుకే అమీర్ ఖాన్ కిర‌ణ్‌రావుతో విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో అమీర్ ఖాన్, ఫాతిమా చాలా పార్టీలకు కలిసి హాజరవ్వడంతో వీరిద్ధరి మధ్య ఎఫైర్ ఉందని అంతా అనుకున్నప్పటికీ ఇన్ని రోజులు ఆ వార్తలను లైట్ తీసుకున్నారు. కానీ అమీర్ ఖాన్ తాజాగా తన రెండో భార్య నుంచి విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఫాతిమా పేరు తెర‌పైకి వ‌చ్చింది. అయితే నిజంగా అమీర్ ఖాన్ ఫాతిమాతో ప్రేమలో ఉన్నాడా? ఆమెను ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడా? లేక ఇవన్ని ఒట్టి రూమర్స్ మాత్రమేనా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :