“ఆషాడంలో అత్తా కోడళ్ళు”.. జోడీ కట్టిన రవి, శ్యామల.!

Published on Jul 21, 2021 2:52 am IST

ఆషాడ మాసంలో కొత్తగా అత్తారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని, ఈ మాసమంతా కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలన్న సాంప్రాదాయం మన దగ్గర ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని పక్కన పెడితే ఈ ఆషాడ మాసంలో మన అందరికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు జీతెలుగు మరోసారి సరికొత్త ప్రోగ్రాంతో మనముందుకు రాబోతుంది.

“ఆషాడంలో అత్తా కోడళ్ళు” అంటూ వస్తున్న ఈ కార్యక్రమానికి రవి, శ్యామల యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. అత్త కోడళ్ళ జోరుకి వీరిద్దరు జోడీ కట్టినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా చిరంజీవి ఆచార్య సినిమాలో లాహే లాహే పాటకు మెస్మరైజ్ స్టెప్పులేసిన సంగీత ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చి స్టెప్పులేసి అలరించింది. ఇవే కాకుండా ఇందులో అత్తా కోడళ్ళ సందడి ఎలా ఉంటుందనేది తెలియాలంటే జూలై 25 ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు జీ తెలుగును చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :