టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల కలయికలో చేస్తున్న రెండో చిత్రం “ది ప్యారడైజ్” కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు షూటింగ్ దాదాపు పూర్తి చేసుకోవచ్చింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ పై ప్రముఖ సాహిత్య రచయిత ఈ సినిమాకి ఆయా షేర్ అనే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ ని అందించిన కాసర్ల శ్యామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో హైప్ మరింత పెంచేశారు. ప్యారడైజ్ క్లైమాక్స్.. ఆపుకోలేక పెడుతున్నా.. నా మాట గుర్తుంచుకోండి అంటూ ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ని ఆకాశానికి ఎత్తేసారు.
దీనితో ప్యారడైజ్ క్లైమాక్స్ షూట్ ని కూడా పూర్తి చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Climax #Paradaise ..
Mark my tweet …
Just came from the Shoot
ఆపుకోలేక పెడుతున్నా … #DhoomdhoomTahataha @odela_srikanth @NameisNani @SLVCinemasOffl pic.twitter.com/HEdRAXMqNT— Kasarla Shyam (@LyricsShyam) July 7, 2026


