‘ఏబిసిడి’ నుండి ‘మెల్ల మెల్లగా’ సాంగ్ విడుదల !

‘ఏబిసిడి’ నుండి ‘మెల్ల మెల్లగా’ సాంగ్ విడుదల !

Published on Feb 21, 2019 3:00 AM IST

note12

యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబిసిడి . సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను హైలైఫ్ పబ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న మోస్ట్ వాంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట పాడటం విశేషం. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో లైవ్ లో సిద్ శ్రీరామ్ పాట పాడి సందడి చేశాడు. మెల్ల మెల్లగా ఆంటూ సాగే ఈ పాటను కెకె రచించగా సిద్ శ్రీరామ్ అదితితో కలిసి ఆలపించారు. ఈ సాంగ్‌కు సంబంధించిన బిగ్ సీడీని నిహారికా కొణిదెల విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగానిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ మాట్లాడుతూ – “జుడా శాండీగారికి తెలుగు సినిమాల్లోకి మా సినిమా ద్వారా ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆయ‌న చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు చాలా మంచి పేరు వస్తుంది. అలాగే పాట‌ను చ‌క్క‌గా పాడిన సిద్ శ్రీరాంకు అభినంద‌న‌లు. సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్‌లో నిల‌బ‌డుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. మంచి ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – “నా పై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడిగా నాకు అవ‌కాశం ఇచ్చిన అల్లు శిరీష్‌గారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. య‌ష్ రంగినేనిగారు ఈరోజు ఇక్క‌డ‌కు రాలేక‌పోయారు. ఆయ‌న‌కు, ధీర‌జ్ మొగిలినేని గారికి థాంక్స్‌. జుడా శాండీ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. భ‌విష్య‌త్‌లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటారు. కృష్ణ‌కాంత్‌గారు అద్భుత‌మైన సాహిత్యం అందించారు. సిద్‌గారి వాయిస్‌తో ఈ పాట‌కు ఇంకా అందం వ‌చ్చింది. అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ – మంచి టీంతో ఈ సినిమా చేయ‌డం హ్య‌పీగా ఉంది. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఈ రోజు విడుద‌లైన సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ సాంగ్ చాలా బాగా న‌చ్చింది. నేను సిద్ శ్రీరాంకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మ‌ధుర శ్రీధ‌ర్ స‌హా ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు. శాండీకి తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. సినిమా చాలా బాగా ఆడుతుంది అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ… ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి. అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా. ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసిన సింగిల్ గురించి మాట్లాడుతూ. నేను ఓ రోజు బెంగళూరులో కారులో వెళ్తున్నప్పుడు రేడియోలో ఓ పాట విన్నాను. ఆపాట ఇంగ్లిష్ లో స్టార్ట్ అయి కన్నడలో వచ్చింది. సాంగ్ చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ గురించి తెలుసుకున్నప్పుడు జుదా సాంధీ గురించి తెలిసింది. ఈ తరహా సౌండ్ తెలుగు సినిమాకు తీసుకురావాలనిపించింది. ఎబిసిడి సినిమాకు జుదా కరెక్ట్ అనిపించింది. అతనితో ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ పాటకు ఓకల్స్ అందించిన సిద్ శ్రీరామ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన పాటలంటే అంత ఇష్టం. నా సినిమాలోని మంచి పాటను సిద్ పాడటం చాలా హ్యాపీగా ఉందిఅన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు