ఏబిసిడి విడుదల తేదీ ఖరారు !

Published on Feb 12, 2019 8:48 pm IST

యువ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) చిత్రం విడుదల తేదీ మారింది. ముందుగా ఈచిత్రాన్ని మార్చి 1 న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ తాజాగా కొత్త విడుదల తేదీ ని ప్రకటించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈచిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :