బిగ్ బాస్ 4 – ఏ కంటెస్టెంట్ కి లేని రికార్డ్స్ ఇస్తున్న అభిజీత్ ఫాన్స్.!

బిగ్ బాస్ 4 – ఏ కంటెస్టెంట్ కి లేని రికార్డ్స్ ఇస్తున్న అభిజీత్ ఫాన్స్.!

Published on Dec 13, 2020 10:04 AM IST

Abhijeet

ఇప్పుడు నడుస్తున్న మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మరియు మంచి క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా అభిజీత్ కూడా ఉంటాడని చెప్పాలి. తనదైన గేమ్ తో ఆలోచనలతో ఈసారి సీజన్లో గట్టి ఫాలోయింగ్ ను తెచ్చుకున్న కంటెస్టెంట్ గా నిలిచాడు.

మరి అందుకు తగ్గట్టుగానే అభిజీత్ ఫాలోవర్స్ కూడా అంతే రేంజ్ లో తమ అభిమానాన్ని భారీ ఎత్తున చూపిస్తున్నారు. ఇది వరకు ఏ సీజన్లో కంటెస్టెంట్ కు కూడా లేని విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తూ సెన్సేషన్ నమోదు చేసారు. ఇప్పుడు మళ్ళీ అలానే వారి ఓన్ రికార్డ్స్ ను వారే బ్రేక్ చేస్తూ అభిజీత్ పేరిట రాస్తున్నారు.

లేటెస్ట్ గా 5 లక్షల 20 ట్వీట్స్ వేసి లాస్ట్ టైం సెట్ చేసిన వారి రికార్డునే ఇంకా ముందు గానే కొట్టేసారు. ఇంతకు ముందే ఇండియన్ ట్రెండ్స్ లోకి కూడా అభిజీత్ పేరును ఎక్కించారు. ఇప్పుడు “కింగ్ ఆఫ్ హార్ట్స్ అభిజీత్” అనేట్యాగ్ తో భారీ ట్రెండ్ నే చేస్తూ 1 మిలియన్ ట్వీట్స్ ను టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తానికి మాత్రం ఈ కంటెస్టెంట్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. మరి ఫైనల్స్ లో ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు