‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఆంధ్ర హక్కులు హాట్ కేకులా ఎగిరిపోయాయి.

Published on Dec 6, 2019 1:08 am IST

ఈ ఏడాది డియర్ కామ్రేడ్ అంటూ రష్మికతో కలిసి తెరపై ప్రేమను పండించిన విజయ్ దేవరకొండ చేస్తున్న క్రేజీ ఫిలిం వరల్డ్ ఫేమస్ లవర్. వైవిధ్యమైన టైటిల్ మరియు వైల్డ్ అండ్ యాంగ్రీ ఫస్ట్ లుక్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని ఫిదా చేయడంతో పాటు అంచనాలు కూడా పెంచేశారు. నలుగురు హీరోయిన్స్ విజయ్ తో జోడికట్టనున్నారు. రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్, ఇసబెల్లా కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడిగా పేరున్న క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కు యూత్ లో క్రేజ్ దృష్ట్యా ఆయన చిత్రాల థియరిటికల్ రైట్స్ కొరకు డిస్ట్రిబ్యూటర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. కాగా వరల్డ్ ఫేమస్ లవర్ ఆంధ్రా హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దక్కించుకున్నారు. ఈ చిత్ర ఆంధ్ర హక్కులకు కొరకు ఫ్యాన్సీ ధర చెల్లించి ఆయన సొంతం చేసుకున్నట్లు సమాచారం. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పిస్తుండగా వల్లభ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More