నందమూరి నటసింహం బాలకృష్ణ నటించబోయే 99వ సినిమాకు కథ రెడీ అయ్యింది. ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లయన్’ సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత 99వ సినిమా ప్రారంభమవుతుంది. ‘లౌక్యం’తో ఘన విజయం సొంతం చేసుకున్న శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు చిత్ర పరిశ్రమకు వరుస విజయాలు అందిస్తున్న రచయిత ద్వయం కోన వెంకట్ మరియు గోపి మోహన్ లు ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తున్నారు.
‘నందమూరి బాలకృష్ణ గారి సినిమా పట్ల దర్శకుడు శ్రీవాస్, కోన వెంకట్ మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని అంశాలు కలగలిపిన ఒక మంచి స్క్రిప్ట్ రెడీ ఇది.’ అని రచయిత గోపి మోహన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Sriwass,@konavenkat99 &Myself r very excited about our next script with NBK.
It has all the elements of a good script& interesting backdrop.
— Gopi Mohan (@Gopimohan) January 2, 2015


