‘ఆచార్య’ ఫస్ట్ లుక్ వచ్చేది ఆ రోజే ?

Published on Mar 29, 2020 9:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ఆచార్య సినిమా నుండి ఉగాదికి మెగాస్టార్ ఫస్ట్ లుక్ వస్తోందని చాలా రూమర్స్ వచ్చాయి గాని అది జరగలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా ఆచార్య నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. చరణ్ రోల్ సినిమాలో దాదాపు ఇరవై నిముషాల పాటు సినిమాలో కనిపిస్తారని.. అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని సమాచారం.

కాగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

X
More